Saturday, April 27, 2024

‘బిచ్చ‌గాడు 2’ పై లేటెస్ట్ అప్‌డేట్.. రేపే ట్రైల‌ర్ రిలీజ్

విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన బిచ్చగాడు మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా రెడీ అయింది. ప్రేక్షకులని మరోసారి తనదైన శైలిలో అలరించడానికి సిద్దం అయ్యారు విజయ్ ఆంటోని. బిచ్చగాడు 2 నుండి రిలీజ్ అయ్యిన ప్రచార చిత్రాలు, వీడియోలు ఇప్పటికే ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్నాయి. కాగా, ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. పోస్టర్ లో విజయ్ ఆంటోని లుక్ స్టైలిష్ గా ఉంది. ఈ మూవీ మే 19న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement