Sunday, May 5, 2024

న‌రేష్, ప‌విత్ర లోకేష్ ల ల‌వ్ డ్యూయెట్…

”ఉరిమే కాలమా…”అంటూ నరేష్‌, పవిత్రలోకేష్‌ పాడుకుం టున్నారు. ఈ పాటను ‘మళ్లిపెళ్లి’ కోసం చిత్రీకరించారు. తెలుగు, కన్నడ భాషల్లో విలక్షణమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎమ్‌. ఎస్‌. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ సొంతంగా నిర్మిస్తున్నాురు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం ”ఉరిమే కాలమా… ” పాటను విడుద ల చేశారు. కథలో కీలమైన పాట ఇది. సురేష్‌ బొబ్బిలి బాణీకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రానికి ఎంఎల్‌. బాల్‌ రెడ్డి ఛాయాగ్రహణం, అనంతశ్రీరామ్‌ సాహిత్యం అందిస్తున్నారు. జయసుధ, శరత్‌బాబు, వనిత, అనన్య నాగెళ్ల, రోషన్‌, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం తదితరులు నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement