Sunday, May 5, 2024

క్లైమాక్స్ దశలో లక్ష్య

హిట్ , ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే అందులో జాగర్లమూడి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్య సినిమా కూడా ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నారాయణ దాస్ నారంగ్, పుష్కుర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించి కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. కాగా తాజాగా లక్ష్య క్లైమాక్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement