Sunday, April 28, 2024

హుజురాబాద్‌లో దొంగ ఓట్లు.. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఈటల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ మాటల తూటాలు పేల్చుతున్నారు. హుజూరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని, దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 డొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంటలో దొంగ ఓట్లపై ప్రజలు నిఘా పెట్టాలని, ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయవద్దని ఈటల హితవు పలికారు.

ఇది కూడా చదవండి: జికా వైరస్ లక్షణాలు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement