Monday, May 6, 2024

Kicha46.. త్వ‌ర‌లో ఎనౌన్స్ మెంట్.. సుదీప్

Kicha46 త్వ‌ర‌లోనే ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని తెలిపాడు క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్. కాగా ఆయ‌న చివ‌రిగా విక్రాంత్ రోణా’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసి ప్రేక్షకాదరణ పొందారు. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోయాయి. ఈ క్రమంలో కిచ్చా సుదీప్ నుంచి నెక్ట్స్ సినిమా ప్రకటన కోసం అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం రచ్చరచ్చ చేస్తున్నారు. ఇందంతా చూసిన సుదీప్ షాకింగ్ గా స్పందించారు. తను ప్రస్తుతం సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చినట్టు ఓ సుదీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు.ఈ నోట్ లో.. ‘నా స్నేహితులందరికీ నమస్కారం.. Kichcha46 కోసం మీరు చేసిన ట్వీట్లు, మీమ్స్ మొదలైనవాటిని చూశాను.

మీ ఆసక్తిని అర్థం చేసుకున్నాను. మీ ప్రేమ నాకు ప్రత్యేకమైన మరియు ప్రియమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకు ధన్యవాదాలు. అందుకే చిన్న వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నా మొదటి విరామం. విక్రాంత్ రోణా తర్వాత నాకు ఈ విరామం అవసరమైంది. బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్, క్రికెట్ లో కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది. వీటి వల్ల నేను నెక్ట్స్ సినిమా కంటే ముందు బ్రేక్ తీసుకున్నాను. ఈ విరామ సమయం సంతోషంగా ఉండేలా చేశాయి. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి మూడు సినిమాలకు స్క్రిప్టులు ఫైనల్ చేశాను. ఆ స్క్రిప్ట్ చర్చలు రోజువారీగా జరుగుతూనే ఉంటాయి. ఈ మూడు సినిమాల కథలకు భారీ మొత్తంలో హోమ్‌వర్క్ చేయాల్సి ఉంది. సంబంధింత బృందాలు పగలు, రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నాయి. త్వరలో అనౌన్స్ మెంట్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement