Sunday, April 28, 2024

Katrina Khaif : కేవ్వు కేక‌పుట్టిస్తున్న క‌త్రినా ట‌వ‌ల్ ఫైట్

బాలీవుడ్‌ నటి కత్రినా -కై-ఫ్‌ నటించిన స్పై థ్రిల్లర్‌ ‘-టైగర్‌ 3’. ఇందులో తొలి మహిళా స్పైగా నటించింది కత్రినా -కై-ఫ్‌. ‘-టైగర్‌ 3’ చిత్రంలో ‘అమ్మో’ అనేలా అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. టర్కీ హమామ్‌లో చిత్రీకరించిన టవల్‌ ఫైట్‌ ఇప్పటికే వైరల్‌ అయ్యింది. హీరో మాత్రమే చేసే ఫైట్‌ సీక్వెన్స్‌లో ఓ హీరోయిన్‌ ఎంత గొప్పగా నటించగలదో కత్రినా ఇందులో చూపించారు.


ఈ సందర్భంగా కత్రినా -కై-ఫ్‌ మాట్లాడుతూ ‘రిస్కీ కూడిన యాక్షన్‌ సన్నివేశాల్లో ఇష్టపడి కష్టపడి చేశాను. ఓ యాక్షన్‌ హీరోయిన్‌గా అవి నన్నెంతో గొప్పగా ఆవిష్కరించాయి. జోయా అనే స్పైగా నటించారు. జోయా ఓ ఫైటర్‌గా ఇందులో కనిపిస్తుంది. ఈ పాత్రను పురుషులతో సమానంగా పోరాడే ఓ మహిళను చూస్తారు. ఇక టవల్‌ ఫైట్‌ ఎంతో వైరల్‌ అయ్యింది. ఇద్దరు మహిళలు ఇలా నువ్వా నేనా అనేంతగా పోరాడే ఫైట్‌ సీన్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై రాలేదు.” అన్నారు. సల్మాన్‌ ఖాన్‌ -టైటిల్‌ పాత్రలో నటించిన -టైగర్‌ 3 చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement