Saturday, April 27, 2024

Kamal : థగ్‌ లైఫ్ తో వ‌చ్చ‌స్తోన్న క‌మ‌ల్ హాస‌న్…

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్‌, మణిరత్నం కలయికలో రూపొందుతున్న తాజా చిత్రానికి థగ్‌ లైఫ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కమల్‌కు ఇది 234వ సినిమా. ఇటీవలే ఈ చిత్రం ప్రకటన వెలువండిది. గ్యాంగ్‌ స్టర్‌ నేపథ్య చిత్రమిది. ఇంతకు ముందు కమల్‌, మణిరత్నం కలయికలో నాయకుడు సినిమా వచ్చింది.

థగ్‌ లైఫ్‌ చిత్రానికి రవి కె.చంద్రన్‌ ఛాయాగ్రహణం, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా దుల్కర్‌ సల్మాన్‌, జయంరవి, త్రిష ఇతర పాత్రధారులు. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాసు టాకీస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఉదయనిధి స్టాలిన్‌ సమర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement