Friday, May 3, 2024

ఆర్ఆర్ఆర్ లో కూడా కాలభైరవ మార్క్ కనిపించబోతుందా ?

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో… ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా…ఓ ఎమోషనల్ పాటను తన కొడుకు కాలభైరవ పాడినట్లు తెలుస్తుంది. ఆ పాట సినిమాకే హైలెట్ కాబోతుందట. ఇక గతంలో బాహుబలి సినిమాలో ఎమోషనల్ సాంగ్ తో కాలభైరవ ఆకట్టుకున్నాడు. కాలభైరవ ప్రస్తుతం వరుస సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా గడుపుతున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement