Sunday, May 19, 2024

ముంబయిలో ఎన్‌టీఆర్.. ‘వార్’ మొదలెట్టిన తారక్..

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ ‘దేవర’. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. వార్ 2 షూటింగ్‌కి కూడా డేట్స్ ఇచ్చాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వార్ 2. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ ముంబై చేరుకున్నారు. ఎన్టీఆర్ రేపటి నుంచి వారం రోజుల పాటు వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండనున్నాడు. ఆ తర్వాత మళ్లీ దేవర షూట్‌కి వస్తాడని తెలిసింది. స్పై సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని 2025 ఆగస్ట్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement