Wednesday, May 1, 2024

Faria Abdallah : ‘చిట్టి’… ఎక్క‌డ‌…

జాతిరత్నాలు’ చిట్టి తన బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఫరియా అబ్దల్లా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా మెరిసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.

తొలిచిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిట్టి పాత్రలో అందరినీ కట్టిపడేసింది. ఆడియెన్స్ తో పాటు యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందానికి తగిన గుర్తింపు దక్కింది. ఆ వెంటనే ఆమెకు మంచి ఆఫర్లు దక్కాయి. బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది.

- Advertisement -

ఇక ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వస్తోంది.

మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఫరియా అబ్దుల్లా పంచుకున్న ఫొటోస్ అట్రాక్ట్ చేస్తున్నాయి.


ఈ ఫొటోల్లో ఫరియా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఫిదా చేసింది. క్యూట్ స్టిల్స్ తో తన అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement