Saturday, May 18, 2024

Fraud | పాండ్యా బ్రదర్స్‌ను మోసం చేసిన సోదరుడు.. అరెస్ట్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా లను వ్యాపారంలో మోసం చేసిన కేసులో మరో సోదరుడు అరెస్ట్ అయ్యాడు. హార్డిక్ పాండ్యా పిన్ని కొడుకు వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైభవ్ పాండ్యా.. క్రికెటర్ కృనాల్ పాండ్యా, హార్డిక్ పాండ్యా కలిసి 2021 లో ఓ బిజినెస్ ప్రారంభించారు. అందులో వైభవ్ కు 20 శాతం వాటా ఉంది. అయితే, వైభవ్ పాండ్యా… తమ బిజినెస్ పార్టనర్స్‌కి తెలియకుండా సొంతంగా ఇదే తరహా వ్యాపారం మొదలుపెట్టాడు.

అయితే కొత్త బిజినెస్ కోసం పాత వ్యాపారం నుంచి 4.3 కోట్ల రూపాయలను మళ్లించాడు. దీంతో అతనిపై పాండ్యా బ్రదర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ అలాగే ఫోర్జరీ కేసులు నమోదు అయ్యాయి. దీంతో నేడు అతనిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement