Monday, May 6, 2024

సలార్ విలన్…. ఆదిపురుష్ లో కూడా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు సిద్ధార్థ శుక్ల ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తలు రాగా…. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ నటుడు పేరు వినిపిస్తోంది.

అతను మరెవరో కాదు. జాన్ అబ్రహం. ఆది పురుష్ లో జాన్ అబ్రహం కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట. ఇప్పటికే సలార్ లో జాన్ అబ్రహం పేరు వినిపించింది. మరి ఆది పురుష్ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement