Wednesday, April 24, 2024

మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ ప్రేరేపిత హింసను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఇద్దరు లాయర్లు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలు ఈ పిటిషన్ వేశారు.

పిటిషనర్ల తరఫున అడ్వకేట్ పింకీ ఆనంద్ కోర్టు ముందు హాజరయ్యారు. ఎన్నికల అనంతర చెలరేగిన హింసాకాండపై ‘సిట్’ చేత దర్యాప్తు చేయించాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. దీనిపై న్యాయమూర్తులు వినీత్ శరణ, బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. జూన్ 7లోగా కోర్టుకు సమాధానం తెలియజేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను జూన్ రెండో వారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement