Saturday, April 27, 2024

జాతిరత్నాలు బ్యూటీకి మరో అవకాశం!!

అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటించింది. అయితే ఈ సినిమాలో హిట్ కొట్టిన తర్వాత అటు దర్శకుడికి హీరోకి అలాగే హీరోయిన్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కు ఓ మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఓ టాప్ డైరెక్టర్ తన సినిమా కోసం ఈ అమ్మడిని ఓకే చేశాడట. అలాగే ఫరియా ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement