Friday, April 26, 2024

మహేష్ కు విలన్ గా అర్జున్ ?

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుందనగా కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాలో విలన్ గా నటించేది ఎవరు అనే దాని పై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

మొదట కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ అలాగే బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కోలీవుడ్ స్టార్ అరవిందస్వామి వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ విలన్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటికే అర్జున్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ స్పందించాల్సిందే. కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement