Sunday, May 12, 2024

ఓటీటీ డీల్ రద్దు చేసుకున్న జగదీష్ నాయుడు ?

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడు గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైనలుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ కాబోతుంది అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఓటీటీ ఒప్పందం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement