Wednesday, May 15, 2024

పిల్ల‌ల‌కి పాఠాలు చెబుతోన్న.. క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తి

స్కూల్ పిల్ల‌ల‌కి పాఠాలు చెబుతున్నాడ‌ట జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తి.. చాలా స్కిట్లలో ఆదికి భార్యగా లేడీ గెటప్‌లలో కూడా అలరించారు. పలు సినిమాల్లో కూడా కమెడియన్‌గా నటించి మెప్పించారాయన. అయితే ఆది జబర్దస్త్‌ షో మానేశాక గణపతి కూడా బయటకు వచ్చేశారు.జబర్దస్త్ రెగ్యులర్‌గా చూసేవారికి గణపతి అంటే తెలియని వారుండరు. హైపర్‌ ఆది టీమ్‌లో చాలా బొద్దుగా ఉంటూ కామెడీ పంచులతో తెగ నవ్వించారాయన. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారట ఈ మేర‌కు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన గణపతి అదే మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా బాధ్యతలు తీసుకున్నారట. 1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్‌ కేటాయించింది. అందులో జబర్దస్త్‌ గణపతి కూడా ఉన్నారట.. అన్నట్లు సర్కార్‌ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలనే కల ఈనాటిది కాదట. అతని 25 ఏళ్ల కలనట. జబర్దస్త్‌ కు రాకముందు కూడా కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారట. ఆ తర్వాతే హైదరాబాద్‌ కు వచ్చి కమెడియన్‌గా స్థిరపడ్డారట. మొత్తానికి కామెడీ పంచులు, ప్రాసలతో నవ్వించిన గణపతి ఇప్పుడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేందుకు రెడీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement