Wednesday, May 1, 2024

అన్న డేటింగ్ గురించి అడిగితే.. త‌న హెయిర్ గురించి చెప్పిన అఖిల్

హీరో నాగచైతన్య – శోభిత ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారంటూ గ‌త కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు చైతు.. శోభిత లండన్ లో చక్కర్లు కొడుతున్నట్టు హోటల్లో డిన్నర్ చేసినట్లు ఫోటో బాగా వైరల్ అయింది. దీనిపై రీసెంట్ గా శోభిత కూడా స్పందించారు. అది నేను కాదు అంటూ బదులిచ్చారు. తాజాగా వీరి డేటింగ్ రూమర్లపై హీరో అఖిల్ అక్కినేని కి ప్రశ్న ఎదురయింది. దీంతో ఇంట్రెస్టింగా బదులిచ్చారు ..మీ అన్న నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఎవరో అమ్మాయితో ఫోటోలు కనిపించి టాపిక్ గా మారారు. మరి మీ పరిస్థితి ఏంటి అని ప్ర‌శ్నించారు.

దీనిపై అఖిల్ స్పందిస్తూ.. కేవలం తన వరకే బదులిచ్చారు. అన్న చైతన్య పై వస్తున్న రూమర్లపై కామెంట్ చేయలేదు…. అఖిల్ మాట్లాడుతూ.. నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీ మెయింటైన్ చేయడం సరిపోయింది. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాలపైనే.. అంటూ బదులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర వహిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయక. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 18న పవర్ ఫుల్ ట్రైలర్ రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement