Sunday, May 12, 2024

సినిమా ఆగలేదు – ఎన్టీఆర్ త్రివిక్రమ్ వస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో నే త్రివిక్రమ్ తో సినిమా ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి ఆ సినిమా ఆగిపోలేదట. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్క బోతున్న ఈ సినిమాలో రాజకీయా నాయకుల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని చెబుతూ త్రివిక్రమ్ ఈ సినిమాని తీయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు ఆరు సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుని జోరుమీదున్న ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అంటే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లకు అవకాశం ఉండగా అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement