Sunday, May 12, 2024

Nani30 స్క్రిప్ట్‌పై.. మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో నాని30వ సినిమాలో ఛాన్స్ కొట్టింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ..కాగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కాగా మృణాల్ ఠాగూర్ బాలీవుడ్ సినిమా గుమరాహ్​లో పోలీస్ పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 7న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మృణాల్‌. ఈ ఇంటర్వ్యూలో నేచురల్‌ స్టార్‌ నానితో చేయనున్న సినిమా Nani30 స్క్రిప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Nani30 సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో అంత మంచి స్క్రిప్ట్‌ను ఇప్పటి వరకు చదవలేదని మృణాల్ చెప్పింది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిపింది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభమవుతుందని.. ఇంత మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. నాని 30వ చిత్రంతో సౌరవ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement