Monday, April 29, 2024

నేను ఏ ఐటెం సాంగ్ లో న‌టించ‌డం లేదు.. స‌మంత‌

పుష్ప చిత్రంలో ఫ‌స్ట్ టైం ఐటెంసాంగ్ లో మెరిసింది స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెర కెక్కింది ఈ పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్. అయితే ఈ సీక్వెల్ లో సుకుమార్ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. ఐటెమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆఫర్ ను సామ్ తిరస్కరించింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా సమంత కూడా స్పందించింది. తాను ఏ ఐటెం సాంగ్‌ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సమంత.

Advertisement

తాజా వార్తలు

Advertisement