Friday, May 3, 2024

ద‌స‌రాలో క్రికెట్ ర్యాప్.. ఫుల్ వీడియో రిలీజ్

మాస్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయింది హీరో నాని న‌టించిన ద‌స‌రా మూవీ. ఈ మూవీలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంది. తన స్నేహితుడి కోసం విలన్ సమక్షంలో హీరో నాని ఈ క్రికెట్ లో తప్పకుండా గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తమ టీమ్ ఓటమి చివరికి వెళ్లినప్పుడు నాని ఒక్కసారిగా చెలరేగిపోతాడు. థియేటర్లో ఈ సీన్ మంచి కిక్ వచ్చేలా చేస్తుంది. అలాంటి క్రికెట్ గేమ్ కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ క్రికెట్ ఎపిసోడ్ లో నానీలోని స్టైల్ ను ఆవిష్కరించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఆడియన్స్ లో హుషారెత్తించే సన్నివేశాలలో ఇది ఒకటి.నాని హీరోగా రూపొందిన ‘దసరా’ సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా, ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement