Thursday, November 30, 2023

ఓటీటీలో ఛత్రపతి హిందీ రిమేక్… స్ట్రీమింగ్ ఎక్క‌డంటే !

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్… ఇటీవల బాలీవుడ్​లో ప్ర‌భాస్ మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ రీమేక్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ రీమేక్ మూవీని టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌‌గా నిలిచింది.

- Advertisement -
   

ఇక తాజాగా ఎటువంటి చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎటువంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఛత్రపతి హిందీ రీమేక్ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement