Thursday, May 9, 2024

త్వరలోనే ‘‘హాయ్ నాన్నా’’ ఫ‌స్ట్ సింగిల్..

ఈ ఏడాది ప్రారంభంలో నాని “దసరా”తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కాగా, ఇప్పుడు నూత‌న‌ దర్శకుడు శౌర్యువ్ డైరెక్ష‌న్ లో “హాయ్ నాన్నా” అనే సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకి రానున్నాడు. ఈ మూవీ నిర్మాణం దాదాపు పూర్తైన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా కూనూర్ షెడ్యూల్ కూడా పూర్తయింది.

ఇక మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో త్వ‌ర‌లోనే మూవీ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించ‌నున్నారు. ఇక ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మూవీ నుంచి ముందుగా పాటలను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. “కుషి” ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించ‌గా.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మించ‌గా.. డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement