Saturday, April 27, 2024

నిర్మాతగా కేరింత హీరో

కేరింత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్ ,ప్రేమ కథ చిత్రం 2, వంటి సినిమాలలో హీరోగా నటించిన సుమంత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు కొడుకే ఈ యంగ్ హీరో సుమంత్ అశ్విన్. అయితే ఇప్పుడు సుమంత్ నిర్మాతగా మారబోతున్నాడు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. అయితే ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఎమ్ ఎస్ రాజు ఇటీవల డర్టీ హరి సినిమాతో దర్శకుడిగా కూడా ఆకట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. సెవెన్ డేస్, సిక్స్ నైట్స్ ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు. దీనికి నిర్మాతగా సుమంత్ అశ్విన్ వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement