Tuesday, May 7, 2024

మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టిలో పాట పాడ‌నున్న హీరో ధ‌నుశ్..!

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి చిత్రంలో పాట పాడ‌నున్నార‌ట స్టార్ హీరో ధ‌నుశ్. స్టార్ హీరోయిన్ అనుష్క‌శెట్టి.. యువ హీరో న‌వీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది..ఈ చిత్రం కోసం స్టార్ హీరో పాట పాడబోతున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రాబోయే ఈ పాటను మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాధన్‌ త్వరలోనే ధనుష్‌ చేత రికార్డింగ్ చేయించబోతున్నాడన్న టాక్ ఫిలింనగర్ సర్కిల్‌లో జోరుగా నడుస్తోంది. టాలెంటెడ్‌ యాక్టర్‌ ధనుష్‌ రీసెంట్‌గా సార్ చిత్రంలో వావాథి సాంగ్‌తో నెట్టింటిని షేక్ చేశాడు. అనుష్క సినిమాలో ధనుష్‌ పాట ఉండబోతుందన్న న్యూస్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement