Friday, May 3, 2024

Ashika :అదిరింది …నా సామిరంగ నాయిక లుక్

నాగార్జున అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా విజయ్‌ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తోంది.

ఆమె లుక్‌ను విడుదలచేశారు. పోస్టర్‌ ద్వారా వరలక్ష్మిగా పరిచయమైన ఆషికా రంగనాథ్‌ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో కనిపిస్తోంది. ఆషికా అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు- చిత్ర బృందం ఒక గ్లింప్స్‌ ని కూడా విడుదల చేశారు. కీరవాణి బ్యాగ్రౌండ్‌ స్కోర్ చేశారు.
నాగార్జున మ్యాసీగా కనిపించగా, ఆషికా రంగనాథ్‌ హాఫ్‌ శారీలో అచ్చ తెలుగు అమ్మాయి లుక్‌ లో ఆకట్టు-కున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. చంద్రబోస్‌ సాహిత్యం అందిస్తున్నారు. నాగార్జున, కీరవాణి, చంద్రబోస్‌ కాంబినేషన్‌లో ఆల్బమ్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్కన్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘నా సామి రంగ’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement