Sunday, April 28, 2024

రామాయ‌ణ నృత్యం రూపకం – ఆక‌ట్టుకున్న హేమామాలిని

డ్రీమ్‌గ‌ర్ల్ హేమామాలిని త‌న ట్యాలెంట్‌ను మ‌రోసారి చూపించారు. రామాయ‌ణ డ్యాన్స్ డ్రామాతో త‌న న‌ట‌నా కౌశ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. నాగ‌పూర్‌లో జ‌రిగిన మ‌హా సంస్కృతి మ‌హోత్స‌వ్ వేడుక‌లో ఆమె నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేశారు. సీత పాత్ర‌లో ఆమె జీవించేశారు. భార‌తీయ క‌ళా వైభవాన్ని ఆమె త‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో వ్య‌క్తం చేశారు. సుమారు 54 మంది ఆర్టిస్టుల‌తో ఆమె ఆ డ్యాన్స్ షో చేశారు. దాదాపు 25వేల మంది ప్రేక్ష‌కులు ఆ షోను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించారు.

అందం, హావ‌భావాల‌తో హేమా మాలిని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. రామాయ‌ణ క‌థ‌పై రూపొందించిన డ్యాన్స్ డ్రామాలో అన్ని ద‌శ‌లను ప్ర‌జెంట్ చేశారు. రాముడు, సీతా జ‌న‌నం, వారి బాల్యం, విద్యాభ్యాసం, స్వ‌యంవ‌రం, ఆ త‌ర్వాత 14 ఏళ్ల వ‌న‌వాసం, రావ‌ణుడిపై విజ‌యం లాంటి స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశారు. రామ్‌టేక్‌లోని నెహ్రూ మైదాన్‌లో ఈ షోను నిర్వ‌హించారు. సన్నివేశానికి త‌గిన‌ట్లు హేమామాలిని త‌న కాస్ట్యూమ్స్‌ను ధ‌రించారు. ఆ న‌టి హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement