Sunday, May 5, 2024

KNL: పంచలింగాల చెక్ పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణకాంత్..

కర్నూల్ ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అన్నారు. ఈ సంధర్బంగా శనివారం కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దు – పంచలింగాల చెక్ పోస్టును జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. మద్యం, డబ్బు తరలించే వాహనాలను గుర్తించే విధంగా ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

పలు సూచనలు, సలహాలు చేశారు. సీసీ కెమెరాలు, గట్టి ఫోర్సును ఏర్పాటు చేసి బాగా మానిటరింగ్ చేయాలన్నారు. చెక్ పోస్టులలో 24 గంటలు తనిఖీలు నిర్వహించాలన్నారు. వాహనాల తనిఖీలు విరామం లేకుండా రెగ్యులర్‌గా సీసీ కెమెరాలలో రికార్డ్‌ అవుతున్నాయా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద అనుబంధ శాఖల సమన్వయంతో బాగా పని చేయాలన్నారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, కర్నూలు పట్టణ డిఎస్పీ కరణం.విజయశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, కర్నూలు తాలుకా ఇంచార్జ్ సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, సెబ్ ఏఈఎస్ రాజశేఖర్ గౌడ్, కర్నూలు తాలుకా ఎస్సైలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement