Monday, May 6, 2024

వకీల్ సాబ్ కు మించి హరిహర వీరమల్లు కలెక్షన్స్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. అయితే పింక్ రీమేక్ చిత్రంగా వచ్చిన వకీల్ సాబ్ కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. వకీల్ సాబ్ కు వస్తున్న రెస్పాన్స్ కు ఇప్పుడు… క్రిష్ తో పాటు వీరమల్లు సినిమా నిర్మాతలు కూడా నమ్మకాలు పెంచుకుంటున్నారట.

వకీల్ సాబ్ లాంటి రీమేక్ సినిమా హిట్ కావడం, అందులో కరోనా సమయంలో మంచి వసూళ్లు రాబట్టడంతో పాన్ ఇండియన్ సినిమా అయిన హరిహర వీరమల్లు కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ వకీల్ సాబ్ కు మించి భారీగా వసులు చేసే అవకాశం ఉందని అభిమానులు అలాగే సినిమా విశ్లేషకుల అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement