Thursday, October 10, 2024

హనుమాన్ మూవీ అప్‌డేట్.. మూడవ సింగిల్ రిలీజ్ అప్పుడే !

టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సూపర్ హీరో యాక్షన్ మూవీ ‘హనుమాన్’. ఈ మూవీపై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి.

ఇక అదే జోరుతో.. తమ మూవీ నుండి నవంబర్ 28న మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి శ్రీమతి చైతన్య సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement