Saturday, May 4, 2024

పెళ్లిపీటలు ఎక్కబోతున్న ముద్దుగుమ్మ హాన్సిక.. జైపూర్​ ప్యాలెస్​లో ఏర్పాట్లు

అప్పుడెప్పుడో సుమారు 20 ఏళ్ల కిందట వచ్చిన ‘కోయి మిల్‌గయా’ మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సికా మోత్వానీ. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2007లో 16ఏళ్ల వయసులోనే అల్లు అర్జున్‌ సరసన దేశముదురు మూవీతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ 31 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. డిసెంబర్‌లో హాన్సిక పెళ్లి చేసుకోబోతోందని, ఇప్పటికే జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌ అండ్‌ ప్యాలెస్‌ బుక్‌ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్యాలెస్‌లో చాలా ఘనంగా హన్సిక పెళ్లి జరగబోతోందని ఓ టీవీ రిపోర్ట్‌ చేసింది. ఇప్పటి నుంచే ఈ ప్యాలెస్‌లో ఆమె పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆ రిపోర్ట్‌ వెల్లడించింది.

అయితే.. హాన్సిక పెళ్లి వేదిక గురించి వార్తలు బయటకు వచ్చినా.. ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? డిసెంబర్‌లో ఏ తేదీన పెళ్లి అనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. చివరిసారి 2019లో తెనాలి రామకృష్ణ మూవీలో హాన్సిక కనిపించింది. ఆ తర్వాత 2022లో పలు తమిళ, తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యింది. ఈ ఏడాది హన్సిక చేతిలో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి.

ఇక.. తమిళంలో ఆమె మహా అనే మూవీ చేసింది. ఇది ఆమెకు 50వ సినిమా కావడం విశేషం. ఈ మూవీ తెలుగులోనూ డబ్‌ అయ్యింది. గత నెల 9వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ మహా మూవీలో ఆమె తన మాజీ లవర్‌ శింబుతో కలిసి నటించింది. కోలీవుడ్‌లో 2013 నుంచి వీళ్ల మధ్య ప్రేమాయణం హాట్‌ టాపిక్‌గా ఉంది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా.. తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement