Monday, May 6, 2024

సింథటిక్ పటాకులు వద్దు .. గ్రీన్ క్రాకర్స్ కాలుద్దాం

ప్రభ న్యూస్‌, (హైదరాబాద్‌ ప్రతినిధి ) : సింథటిక్‌ టపాసులు వద్దు.. గ్రీన్‌ టాపాసులనే వాడండి అనే నినాదాన్ని మరింతంగా ప్రజల్లోకి తీసుకె ళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24న జరగనున్న దీపావళి పండుగ సందర్భంగా తక్కువ కాలుష్యం వెదజల్లే గ్రీన్‌ క్రాకరీను వాడేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ‘మట్టే ముద్దు.. రసాయనాలొద్దు, మట్టి గణపతులను పూజించండి.. పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ పెద్దఎత్తున ప్రచారాన్ని ప్రారంభించి నగర ప్రజల్లో కొంతమేర మార్పు తీసకొచ్చిన ప్రభుత్వం అదే తరహాలో దీపావళికి తక్కువ పొల్యూషన్‌ వెదజల్లే గ్రీన్‌ టపాసులనే వాడేలా అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకిదిగిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తగు చర్యలకు సన్నద్దం అవుతోంది. టీవీలు, రేడియోలు, కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పండుగకు వారం రోజులే ఉండటంతో మరో రెండు రోజుల్లో కార్యచరణను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం మూలంగా నిషేధిత ఉద్గారాలు ప్రమాద స్థాయిలో పెరిగి స్వచ్ఛమైన గాలి దొరకడం గగనంగా మారిన నేపథ్యంలో పీసీబీ చేపట్టే అవగాహన వల్ల కొంతలో కొంతైనా మేలు జరగుతుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

గ్రీన్‌ కాకరీ అంటే?

మట్టి గణపతుల్లా గ్రీన్‌ కాకరీలు తక్కువ పొల్యూషన్‌ వెదజల్లుతాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతీఏటా విచ్చలవిడిగా కాలుస్తున్న టపాసుల వల్ల గాలి తీవ్ర స్థాయిలో కాలుష్యం అవుతోంది. పొల్యూషన్‌ను తగ్గించే గ్రీన్‌ టపాసులను నేషనల్‌ ఎన్విరాల్‌ మెంట్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ (ఎన్‌ఈఈఆర్‌), కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రీయల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఫ్లవర్‌ పాట్స్‌, బాంబులు, భూచక్రాలు, పెన్సిల్స్‌ తదితర టపాసులను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. వీటి తయారీలో అల్యూమినియం, బోరియం నైట్రేట్‌ తదితర ఎక్కువ రసాయనాలు కలిగి ఉండే వాటిని వాడరు. సాధారణ టపాసుల కన్నా ఇవి 30శాతం పొల్యూషన్‌ తక్కువగా ఉండటంతో పాటు సౌండ్‌ పొల్యూషన్‌ స్థాయికూడా తక్కువగా ఉండనుంది. అయితే వీటి ధరలు మాత్రం 30 నుంచి 40శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది. వీటిని తయారుచేసే ముడి సరుకులు మామూలు క్రాకర్‌ ముడిసరుకుల ధరకంటే అధిక ంగా ఉం టాయని తయారీదారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement