Sunday, May 19, 2024

Deewali Josh: తగ్గిన గోల్డ్​ రేట్లు.. ధన్​తేరాస్​ బిజినెస్​పైనే వ్యాపారుల ఆశలు

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెలలో కనిష్ట స్థాయికి చేరాయి. 10 గ్రాములకు ₹50,320 నుంచి ₹50,545 మధ్య బంగారం ధర ఉంది. వెండి కిలోకు ₹56,542 వద్ద ట్రేడ్​ అవుతోంది. అయితే.. దీపావళి, ధన్​తేరాస్​ పండుగలను పురస్కరించుకుని బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయి. అందులో సంపద, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అక్టోబర్​ 23న ధన్​తేరస్ పండుగను జరుపుకుంటారు. దీనికంటే ముందు బంగారం ధర తగ్గడం కూడా దేశంలో రిటైల్ డిమాండ్‌కు మంచి ఊపునిస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బంగారు ఆభరణాలు, నాణేలు, బార్​ల డిమాండ్ దేశంలో ఎక్కువే ఉంటుంది. సాధారణంగా – ప్రపంచంలోనే భారత్​ బంగారం కొనుగోలులో రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది.- అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. వచ్చే వారం నుండి ప్రారంభమయ్యే ధన్‌తేరస్, దీపావళితో సహా పండుగల ద్వారా బంగారం అమ్మకాలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా మహమ్మారి కొనసాగిన రెండేళ్ల తర్వాత బంగారం కొనుగోళ్లు పుంజుకోవడంతో గత ఏడాది చివరి త్రైమాసికంలో దేశంలో ఆభరణాల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇక.. గ్లోబల్ మార్కెట్లలో బంగారం 0.1శాతం పెరిగి ఔన్సుకు 1,35,821.57 రూపాలకి చేరుకుంది. అయితే.. ఈ లాభనష్టాల మధ్య హెచ్చుతగ్గులున్నాయి.

రూపాయితో పోలిస్తే డాలర్‌ ధర పెరగడంతో గత మార్చి నుండి బులియన్ దాదాపు 20% పడిపోయిందని తెలుస్తోంది. సాధారణంగా డాలర్ రేటు పెరగడం కూడా బంగారం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. కొన్ని రోజుల నుండి బలహీనంగా ట్రేడింగ్ అవుతున్న బంగారంతో పాటు వెండి ధర కూడా బాగా దెబ్బతిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement