Monday, May 6, 2024

గుత్తా జ్వాల పెళ్లి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది..

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల వివాహం చేసుకొని 5 నెలలు అవుతుంది. తమిళ సినీ హీరో విష్ణు విశాల్ ను ఆమె పెళ్లాడింది. ఈ ఏప్రిల్ 2న వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. తక్కువ మంది మాత్రమే పెళ్లికి హాజరైనా… పెళ్లి వేడుక మాత్రం వైభవంగా జరిగింది.తాజాగా వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను విష్ణు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈరోజు గుత్తా జ్వాల పుట్టిన రోజు. తన భార్య జన్మదినం సందర్భంగా వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, వివాహ వేడుక, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి. రిసెప్షన్ లో యావత్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా స్పెప్పులు వేయడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

YouTube video

ఇది కూడా చదవండి: #RC15 లాంచ్ రేపే.. హైదరాబాద్ లో ల్యాండయిన కియారా

Advertisement

తాజా వార్తలు

Advertisement