Friday, April 26, 2024

రాధే శ్యామ్ లో పూజా హెగ్డే పాత్రపై కొత్త గాసిప్

గతేడాది వచ్చిన అలావైకుంఠపురము లో సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పూజ హెగ్డే. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తుంది. అలాగే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలోనూ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ చిత్రం జూలై 30న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తుందని ఆమె ఒక హాస్పిటల్ లో పని చేస్తూ ఉండగా… ప్రమాదానికి గురైన హీరో అక్కడికి వచ్చి ఆమెతో ప్రేమలో పడతాడట. అయితే మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement