Tuesday, May 14, 2024

Gaami | థియేట‌ర్ల‌లో ‘గామి’ జోరు.. రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే !

విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో దాదాపు ఆరేళ్ళ పాటు రూపొందిన ఈ మూవీ.. క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం చూపిస్తొంది. బాక్సీఫీస్ వ‌ద్ద మంచి కలెక్ష‌న్ల‌ల‌ను రాబ‌డుతొంది.

మొదటి రోజే రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని విశ్వక్ సేన్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన ఈ మూవీ.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తుంది. రెండో రోజు ఈ మూవీ రూ.6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి అదుర్స్ అనిపిస్తుంది. అటు అమెరికాలో కూడా 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద రెండురోజుల్లో ఈ చిత్రం.. రూ.15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement