Monday, April 29, 2024

WPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ లో భాగంగా ఇవ్వాల జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ సీజన్ డబ్ల్యూపీఎల్‌లో మ్యాచ్‌లు ర‌స‌వ‌త్తంగా జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో ( మార్చి 15 నుంచి ) నాకౌట్‌లు ప్రారంభం కానుండగా, ప్రతి జట్టు ప్లేఆఫ్స్‌లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని… పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో స్థానం సంపాదించుకోవాలని భావిస్తున్నాయి. కాగా, ఇప్పటికే నిన్న జరగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఇక, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా మంచి జోరు కనబరుస్తొంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ మూడు మ్యాచ్‌లు గెలిచి మూడు ఓడిపోయి 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంచ‌నా జ‌ట్టు:

సబ్భినేని మేఘన, స్మృతి మంధాన (సి), ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (WK), సోఫీ డివైన్, సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, ఏక్తా బిష్త్, సిమ్రాన్ బహదూర్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్

- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్ అంచ‌నా జ‌ట్టు :

మెగ్ లానింగ్ (సి), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్/మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, తానియా భాటియా (wk), శిఖా పాండే, టిటాస్ సాధు

Advertisement

తాజా వార్తలు

Advertisement