Monday, April 29, 2024

నెంబర్ 1 ప్లేస్ లో ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’

కరోనా తరువాత విడుదల అయిన చిత్రాలలో గాడ్జిలా వర్సెస్ కాంగ్ అగ్రస్థానం లో నిలిచింది. టెనెట్ సినిమా 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో గ్లోబల్ బాక్సాఫీస్ లో గాడ్జిలా వర్సెస్ కాంగ్ రికార్డ్ సృష్టించింది. న్యూయార్స్, లాస్ ఏంజెల్స్ లో థియేటర్లు రీ-ఓపెన్ చేసిన తర్వాత విడుదలైన తొలి చిత్రం ఇదే కావడం ఈ చిత్రానికి ముఖ్యంగా కలిసి వచ్చింది.

ఈ సీరిస్ లో వచ్చిన గత మూడు చిత్రాలకంటే చైనాలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అత్యధికంగా 177 మిలియన్ డాలర్లను వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 19.1 మిలియన్ డాలర్లు, మెక్సికోలో 17.3 మిలియన్ డాలర్లు, తైవాన్ లో 12.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విదేశీ వసూళ్ళలో ఒక్క ఐమాక్స్ 28.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి, 9 శాతం కలెక్షన్లు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement