Thursday, March 28, 2024

తల్లి విజయమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షర్మిల

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం నాడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తల్లితో షర్మిల కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే మామ్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా విజయమ్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వైసీపీ రంగులతో ఉన్న కేక్ కట్ చేసి సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement