Friday, May 10, 2024

వంటలక్క డాక్టర్ బాబు కలవాలి – ఫ్లెక్సీ కొట్టించేసిన అభిమాని

కార్తీకదీపం సీరియల్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎపిసోడ్స్, ఎపిసోడ్స్ రన్ అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క పాత్రలకు ఇళ్లలో ఆడవాళ్ళు పూర్తిగా కనెక్ట్ అయ్యారు. ఎంతలా కనెక్ట్ అయ్యారంటే కార్తీకదీపం సీరియల్ ప్రసారమయ్యే మాటీవీలో టెలికాస్ట్ అయ్యే వేరే ప్రోగ్రామ్స్ కు సీరియల్స్ కు ఆ స్థాయిలో రేటింగ్ రావడం లేదు.

గతంలో బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలు కూడా కార్తీక దీపం రేటింగ్ ను టచ్ చేయలేకపోయాయి. అంతేకాదు ఇప్పటివరకు వంటలక్క పేరుతో టీ స్టాల్స్, హోటల్స్ కూడా వెలిశాయి. ఇక తాజాగా ఓ బ్యానర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. కార్తీకదీపం 1001 ఎపిసోడ్ లో నైనా దీప డాక్టర్ బాబు కలవాలి అని కోరుకుంటూ మీ కేబుల్ ఆపరేటర్ కొటారి జగన్ అంటూ ఓ వ్యక్తి ఏకంగా ఫ్లెక్సీని కొట్టించాడు. అందుకు సంబంధించిన ఫ్లెక్సీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్స్ చూసి చూసి విసిగిపోయి ఈ పని చేసి ఉంటాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement