Thursday, April 25, 2024

‘సంచారి’ పవన్ సినిమా టైటిల్ ఫిక్స్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలతోపాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ టైటిల్ పై అభిమానులలో కూడా ఏదో తెలియని ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ని హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు… ఓ బైక్ ఫోటో పెద్ద బాలశిక్ష పుస్తకం గులాబీ పువ్వు కూడా పెట్టి సినిమాపై ఆసక్తిని పెంచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement