Tuesday, May 14, 2024

Fighter | వావ్ అనిపిస్తున్న దీపిక లుక్ !

హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘ఫైటర్’. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన హృతిక్ లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తొంది. దీంతో సినిమాపై కూడా మంచి అంచనాలే ఎర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి దీపికా పదుకొణె పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమాలో దీపిక ‘‘మిన్ని” అనే పాత్రలో నటిస్తోందని వెల్లడించారు. విడుదలైన పోస్టర్‌లో, దీపిక రియ‌ల్ ఫైట‌ర్ నే మించిపోయింది. ఆ రేంజ్ లో దిపిక లుక్ హైలైట్ అవుతుంది. పైట‌ర్ దుస్తుల్లో దీపిక వావ్ అనిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement