Monday, April 29, 2024

Breaking: సీఎం అభ్యర్థి పరిశీలనలో నేనూ ఉంటా… ఉత్తమ్

సీఎం అభ్యర్థి పరిశీలనలో నేనూ ఉంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం రేసులో నలుగురు, ఐదుగురు ఉండడం తప్పు కాదన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పక్కా ప్రొసీజర్ ఫాలో అవుతుందన్నారు.

హైదరాబాద్ లో పూర్తి వాష్ అవుట్ అయ్యామన్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదన్నారు. 70నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించామని, కానీ ఆశించిన విధంగా రాలేదన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నానన్నారు. తనకు అన్ని అర్హతలున్నాయన్నారు. తన అభిప్రాయం హై కమాండ్ కు చెప్పానన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement