Friday, April 26, 2024

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు… పెళ్లి సందD

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా పాతికేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ముఖ్యంగా కీరవాణి అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD చిత్రం తెరకెక్కుతోంది.

గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను అలాగే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే అన్ని పరిస్థితులూ సద్దుమణిగాక సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి పెళ్లి సందD చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement