Saturday, April 27, 2024

మాస్ మహారాజా సరసన ‘జాతి రత్నం’

ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన నటీనటుల జాబితాలో టాలీవుడ్‌లో పెద్దగానే ఉంటుంది.‘జాతిరత్నాలు’ సినిమాలో తనదైన నటన, స్మైల్‌తో కుర్ర ప్రేక్షకులను మెప్పించిన నటి ‘ఫరియా అబ్దుల్లా’. తొలి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ హైదరాబాద్ ముద్దుగుమ్మ అప్పుడే మరో ఆఫర్‌ను లైన్‌లో పెట్టేసింది. మాస్ మహారాజ్ రవితేజ పక్కన ఓ సినిమాలో ఫరియా నటించే అవకాశం ఉందని సమాచారం. ‘చిట్టీ నీ నవ్వంటే’ పాట ఈ నటి ఇమేజ్ పెంచగా.. ఈ పాట చూసిన మేకర్స్ ఈ అవకాశం ఇచ్చినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. కాగా చిట్టీ సాంగ్ అప్పుడే యూట్యూబ్‌లో 27 మిలియన్ వ్యూస్ దాటేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement