Tuesday, May 14, 2024

Fahadh Faasil | రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ఫహద్ ఫాజిల్ టాలీవుడ్ ఎంట్రీ!

సౌత్ ఇండియా టాలెంటెడ్ యాక్ట‌ర్స్‌లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. ‘పుష్ప’, ‘విక్రమ్‌’ సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఫహద్ ఇప్పుడు మెయిన్ లీడ్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ శోబు యార్లగడ్డ నిర్మాణంలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టస్‌ని ప్రకటించాడు. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ & టైటిల్ కూడా రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలతో ఇద్దరు కొత్త డైరెక్టర్లు శశాంక్ & సిద్ధార్థ లని ఇండస్ట్రీకి పరిచియం చేస్తున్నట్టు తెలిపారు.

‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ అనే ఫాంటసీ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకి శశాంక్ యేలేటి దర్శవత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాని సౌత్ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ జూన్ నుంచి మూవీ షూటింగ్ మొదలు కానుండగా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక రెండో సినిమా “ఆక్సిజన్”.. ఈ సినిమాని మరో కొత్త దర్శకుడు సిద్ధార్థ్ నాదెళ్ల తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కూడా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement