Monday, April 29, 2024

Ustad Bhagat Singh – “గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం” – ప‌వ‌న్ క‌ల్యాణ్

YouTube video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి కలిసి పని చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. గాజు పగిలేకొద్ది పదునెక్కిది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పొలిటికల్ టచ్ తో గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ పవన్ ఫ్యాన్స్ ని, జనసైనికులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇక గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ పూర్తి అయిన తరువాత ఈ మూవీ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement