Monday, May 6, 2024

అఖండ ఫస్ట్ సింగిల్ తో పాటు మరో టీజర్…ఎప్పుడో తెలుసా ?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక సినిమాలో పూర్ణ,ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతుంది. అయితే ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ మే 28 ఎన్టీఆర్ జయంతి రోజు విడుదల అవుతుందని సోషల్ మీడియా లో టాక్ నడిచింది. కానీ అలాంటిదేమీ చిత్ర యూనిట్ విడుదల చేయలేదు.

కాగా ఆ ఫస్ట్ సింగిల్ జూన్ 10కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందని తెలుస్తోంది. అలాగే మరో టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement