Sunday, May 19, 2024

Nani | మ‌రో సారి రిపీట్ కానున్న ద‌స‌రా కాంబినేష‌న్..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన మూవీ ‘దసరా’. ఈ సినిమా విడుదలై నేటికి (మార్చి 30) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా.. అభిమానులకు నాని ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నాని – శ్రీకాంత్ కాంబినేషన్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో పాటు పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. దసరాతో కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

కాగా నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. బలగం వేణుతో కూడా నాని ఓ సినిమాకి సైన్ చేసారు. ఇక దాంతోపాటు సుజీత్ దర్శకత్వంతో నాని32 కూడా తెరకెక్కుతొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement